19-01-2026 06:20:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకునికి పార్టీ అరుదైన గౌరవం ఇచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము సతీమణి మార్కొండ యోగితను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు.
నిర్మల్ మున్సిపాలిటీని ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో యోగిత పేరును కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ తెలిపారు. 2004 నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ కెసిఆర్ కు విధేయుడుగా ఉంటూ పార్టీ మారకుండా పనిచేయడంతోనే ఆయనకు ఈ అవకాశాలు లభించినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. అధికారికంగా పేరు ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని వారు పేర్కొన్నారు