calender_icon.png 8 May, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి..

07-05-2025 07:35:21 PM

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్ర..

మునుగోడు (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో సాగు, త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజాల రామచంద్ర అన్నారు. మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం ఉప్పునూతల రమేష్ అధ్యక్షత సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సిపిఐ మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో అధికారికంగా జరపడానికి కార్యవర్గం ఏకగ్రీవ నిర్ణయించడం జరిగిందని పార్టీ శ్రేణులకు తెలిపారు. మహాసభలో భవిష్యత్తు కార్యక్రమాలు అమలు కోరకు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని,ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి ఇవ్వాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు, మాజీ జెడ్పిటిసి గోల్కొండ లింగయ్య, కార్యవర్గ సభ్యులు కాయిత వెంకన్న ఉన్నారు.