07-05-2025 07:33:18 PM
బీఆర్ఎస్ మండల కార్యదర్శి మేకల గంగరాజు..
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నిజమైన నిరుపేదలు ఇల్లు లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి మేకల గంగరాజు(BRS Mandal Secretary Mekala Gangaraju) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయని, కేవలం నాయకులకు వారి వారి అనుబంధ వ్యక్తులకు ఇల్లు మంజూరు చేయిస్తూ నిజమైన నిరుపేదలకు ఇల్లు ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. గ్రామానికి చెందిన రేపాకుల లక్ష్మికి, జూలూరి విరాచారికి ఉండడానికి కనీసం నిలువ నీడ లేదని అయిన వారికి ఇల్లు మంజూరు చేయకపోవడం సోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.