19 August, 2026 | 11:11 PM

పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి

02-09-2025 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అధికారులు యుద్ధప్రతిపాదికన  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్  నందలాల్ పవార్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖల్లో ఎక్కువ రోజుల నుండి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని, అలాంటి శాఖల అధికారులు పెండింగ్ ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు. తదుపరి సోమవారం కందిన ఫిర్యాదుల్లో భూములకు సంబంధించి 41, ఎంపీడీవోలకు 13, మున్సిపల్ కమిషనర్లకి 8,  ఇతర అధికారులకు 14 ఫిర్యాదులు ,మొత్తం 76 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

డి ఆర్ డి ఓ వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి సీ ఓ పద్మ, డి ఈ ఓ అశోక్, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి ఎస్ ఓ మోహన్ బాబు,ఈ డి ఎస్ సీ కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, దయానందరాణి,పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.