02-09-2025 12:00:00 AM
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ, సెప్టెంబర్ 01: కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కుట్ర చేస్తున్నది అని బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కొండమల్లెపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని వారు తెలిపారు.సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే అని ఆయన తెలిపారు.నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చారు వారు అడిగారు.
దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి అని,ఇది కేసీఆర్ గారిపైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నది అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నేతలు,యువజన విభాగం నాయకులు, విద్యార్ది విభాగం నాయకులు, తదితరులు ఉన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ ను ఎత్తివేయాలి.. నకిరేకల్ రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బైఠాయించి ధర్నా
నకిరేకల్, సెప్టెంబర్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ ను వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ పట్టణంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి సరైందికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో అబద్ధపు కల్పన మాయ మాటలు చెప్పి దుర్మార్గమైన ఆలోచనల తోటి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇచ్చిన హామీలనునెరవేర్చలేదన్నారు.రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ కాలేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్యారనిఆయనవిమర్శించారు .
పార్లమెంటు ఎన్నిక వచ్చిందంటే కాలేశ్వరం ప్రాజెక్టు అంటాడు స్థానిక ఎలక్షన్స్ వచ్చిందంటే కాలేశ్వరం ప్రాజెక్టు అంటాడు కానీ ప్రజలకు చేసిందేమీ లేదనిఆయన విమర్శించారునీకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారునాగార్జున సాగర్ నీళ్లు ఆంధ్రకు పోతుంటే తెలంగాణా ప్రజలకు నీళ్లు ఇవ్వడం మరిచిపోయి బీ ఆర్ యస్ నాయకులను విమర్శిం చడం సిగ్గుచేటు అన్నారు.
బిజెపి ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పై కేసులు వెయిస్తూ కేసీఆర్ ను అనగతొక్కలని చూసిన మీరేమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారనిఆయనహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కట్టంగూరు మాజీ జెడ్పిటిసి తలారి బలరాం, కొప్పుల ప్రదీప్ రెడ్డి, రాచకొండ వెంకన్న గౌడ్, గుర్రం గణేష్, ప్రగడపు నవీన్ రావు, నోముల కేశవరాజులు, మారం వెంకటరెడ్డి, రావిరాల మల్లయ్య సామ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్
నల్లగొండ టౌన్, సెప్టెంబరు 1: కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు.కలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గడియారం వరకు భారీ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్లో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కో వాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆ్ప చేస్తున్న కుట్ర మాత్రమే కాదని.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదని తెలిపారు.
నిరసనతో భారీగా వాహనాలు బాగా నిలిచిపోయాయి. దీంతో పోలీస్ అధికారులు, బి ఆర్ ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, లతోపాటు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, శంకర్, కంకణాల వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని అవమానించినట్టు.మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్
తుంగతుర్తి, సెప్టెంబర్ 1: కెసిఆర్ పై సిబిఐ విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లు అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్.కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు.
కాళేశ్వరంపై ఎలాంటి అవినీతి జరగలేదు అని ఆరోపించారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లే అని అన్నారు. బడేభాయ్.చోటే భాయ్ లు కలిసి కేసీఆర్ ను తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన కేసిఆర్ పై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. కమిషన్ నివేదికపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం గొంతు నొక్కి ప్రయత్నం చేస్తుంది అని దుయ్యబట్టారు. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అయింది.
తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి... తెలంగాణ కోసం ఏనాడు జైలుకు వెళ్లలేదు. జై తెలంగాణ అని కూడా నినాదం చేయని రేవంత్ రెడ్డి.ప్రజలంతా గమనిస్తున్నారు.. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు మాజీ మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్. కల్లెట్ల పల్లి శోభన్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య కాలట్లపల్లి ఉప్పలయ్య ,గుండ గాని సోమయ్య గౌడ్ ,సంకేపల్లి రఘునందన్ రెడ్డి ,ఎస్ ఏ రజాక్ మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ ,దొంగరి శ్రీను ,తునికి సాయిలు, గొప్పగాని రమేష్ గోపగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన ర్యాలీ
సూర్యాపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతుల కోసం కకేసిఆర్ కాలేశ్వరం నిర్మిస్టే దానిపై సిబిఐ విచారణ చేపట్టాలనడం ఆయనపై కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత శుభవానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో పలువురు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.