01-09-2025 11:34:50 PM
వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి బి ఆర్ ఎస్ నేతలకు కనిపించడం లేదు అని, 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న తమ నేత వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విపరీత ఆరోపణలు చేస్తున్నారని, వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేములవాడ డివిజన్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తో కలిసి ఆయన మాట్లాడుతూ... కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలుపొందని వ్యక్తులు చౌక బారు ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వేములవాడలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న గులాబీ నేతలకు అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.