అసంపూర్తి పనులు పూర్తి చేయాలి
25-06-2024 05:42 AM
- భువనగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన లబ్ధిదారులు
యాదాద్రి భువనగిరి, జూన్ 24 (విజయ క్రాంతి): భువనగిరిలోని సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అసం పూర్తి పనులు పూర్తిచేసి, లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్, తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేయగా నెల రోజుల్లో లబ్ధిదా రులకు ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షు డు ఏవీ కిరణ్‌కుమార్, అఖిలపక్ష నాయకులు రత్నపురం బలరాం, చింతల కిష్టయ్య, బట్టు రాంచంద్రయ్య, ఏశాల అశోక్, బలరాం, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, రహీం, పెంట నర్సింహ తదితరులు పాల్గొన్నారు.






