8 June, 2026 | 9:51 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

పెండింగ్ వేతనాలు చెల్లించాలి

09-07-2024 12:38 AM

హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ యూనియన్ ధర్నా

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద సోమవారం హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైర్ వెహికిల్స్ డ్రైవర్స్‌కు 16నెలలుగా జీతాలను చెల్లించడం లేదని యూనియన్ నాయకులు వాపోయారు. వేతనాలు రాక కుటుంబాలను కూడా పోషించుకోలేక పోతున్నామని, స్కూలు ఫీజులు కట్టకపోవడంతో తమ పిల్లలను పాఠశాలల యాజమాన్యాలు ఇంటికి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఓపిక పట్టడం తమ వల్ల కాదని, జీతాలు చెల్లించే వరకు తాము వాహనాలను నడపబోమని కార్యాలయం ఎదుటే బైఠాయించారు. స్పందించిన అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపి.. సమస్య పరిష్కారానికి ఐదు రోజల సమయం ఇవ్వాలని కోరారు. ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని, వాహనాలను కూడా నడపబోమని హెచ్చరించారు.