17 April, 2026 | 10:42 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విద్యుత్ సంస్థ ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి

13-06-2025 09:02 PM

భద్రాచలం,(విజయక్రాంతి): 1999 నుండి 2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థలో చేరిన ఉద్యోగులు తమకి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీలకు తమ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అందులో భాగంగా  విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సంఘం (JAC) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభ్యులు శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని కలిసి తమకి పెన్షన్ సౌకర్యం కల్పించవలసిందిగా వినతిపత్రం అందజేశారు. దీనికి  తెల్లం వెంకట్రావు సానుకూలంగా స్పందించి తాను కూడా ఈ విషయాన్ని  ముఖ్యమంత్రి ,  ఉపముఖ్యమంత్రి ల దృష్టికి తీసుకువెళ్తానని త్వరలోనే తమ ప్రభుత్వం తీపి కబురు అంద  జేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డి ఇ  కె. జీవన్ కుమార్  , ఓ సి అసోసియేషన్ తరపున భద్రాచలం ఏ డి ఇ  టి వేణు, డిప్లమా అసోసియేషన్ తరపున కె రాజారావు, 1104 యూనియన్ జిల్లా అధ్యక్షులు  అశోక్ , 327 యూనియన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ , సి ఐ  టి యు యూనియన్ ఎంపీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ వెంకటరాజు , ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా నాయకులు  ఉదయ్ రత్నకుమార్, ఇతర అసోసియేషన్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.