calender_icon.png 8 August, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

08-08-2025 12:21:13 AM

11న ఇందిరాపార్కులో ధర్నా 

తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం 

అధ్యక్షుడు మోహన్ నారాయణ

ఎల్బీనగర్, ఆగస్టు 7: రిటైర్డ్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ డిమాండ్ చేశారు.  డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11న హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం వనస్థలిపురంలో రిటైర్డ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ర్టస్థాయి సమావేశం నిర్వహించి, ధర్నా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రిటైర్డ్ వెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి కె.నరసరాజు మాట్లాడుతూ... దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈహెఎస్ (ఉద్యోగ పెన్షన్ ఆరోగ్య పథకం), పెండింగ్ బిల్లులు, పెండింగ్ లో ఉన్న డీఏ, పీఆర్సీతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 11న హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెన్షనర్ల సంఘం జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి టి.సత్యనారాయణ, టీఏపీఆర్ పీఏ ఉపాధ్యక్షురాలు అరుణ, ప్రసాద్, జ్ఞ్యానేశ్వర్, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు రవీందర్, లక్ష్మీనారాయణ, కృష్ణ మూర్తి, కారింజయ్య, విశ్వనాథ్, నిరంజన్, కురుమూర్తి, బసకయ్య, పీవీపీ సత్యనారాయణ, హరేందర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య, చంద్రకళ, బ్రహ్మనందం, స్వామినాథం, ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.