అభివృద్ధి కోసమే ప్రజా పాలన ప్రణాళిక
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
- నియోజవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం అభివృద్ధి,ప్రజాసంక్షేమం కోసమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టిందని బెల్లంపల్లి సబ్ కలెక్టర్,నోడల్ ఆఫీసర్ మనోజ్ అన్నారు. బెల్లంపల్లి ఆర్ పీ గార్డెన్ లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రజలల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రజల కనీస, మౌళిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు.
పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో తొలుత పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ ప్రజల ప్రశంసలను పొందిదన్నారు. క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి నిర్మాణ పక్రియ మొదలైందని వివరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు అధికారులు గుర్తించారన్నారు. ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆశిస్తున్నారో ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంతో ద్వారా తెలుసుకున్నా మన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆయన వెల్లడించారు. చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ కోసమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రజాసేవే పరమావధిగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. అధికారులు ఈ సందర్భంగా నివేదికలను వెల్లడించారు.






