2 May, 2026 | 6:13 PM

ఎస్సారార్ కళాశాలకు రెండు నూతన ఎఇడిపి కోర్సుల మంజూరు

02-05-2026 05:02 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు రెండు నూతన అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఎఇడిపి) కోర్సులు మంజూరు చేయబడ్డాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. కొత్తగా బీకాం బిఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మరియు బీఎస్సీ హెల్త్ కేర్ ఎఇడిపి కోర్సులు ప్రారంభం కానున్నాయి. 

అదేవిధంగా, బీఎస్సీ లైఫ్ సైన్స్‌లో “మెడికల్ ఫిజియాలజీ” అనే కొత్త సబ్జెక్టును కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ కొత్త కోర్సులను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, దోస్త్ వెబ్ ఆప్షన్‌ల ద్వారా ఎస్సారార్ కళాశాలను ఎంపిక చేసుకొని ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.