2 May, 2026 | 5:55 PM

సఫాయి కార్మికుల సేవలు వెలకట్ట లేనివి

02-05-2026 04:47 PM

కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

మున్సిపల్ కార్మికులకు టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ 42వ డివిజన్ భగత్ నగర్ లో సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్, జెడ్ పీ కోటర్స్ లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్  ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు వేసవికాలం దృష్టిలో పెట్టుకొని టవల్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు వి.మోహన్ రెడ్డి,కేశవ రెడ్డి  మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు.