2 May, 2026 | 6:10 PM

హ్యాండ్ బ్యాగును కొనుగోలు చేసిన అడిషనల్ కలెక్టర్.!

02-05-2026 04:54 PM

షాద్ నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజాప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన  కార్యక్రమానికి హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి, ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు. నాణ్యమైన చిరుధాన్యాలు,ఫ్రూట్స్ రకరకాల స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం  అక్కడే ఏర్పాటు చేసిన ఓ స్టాల్లో హ్యాండ్ బ్యాగును  కొనుగోలు చేశారు.మహిళలు రోజురోజుకు అన్ని రంగాల్లో మరింత ఎదగాలని సూచించారు.