calender_icon.png 1 July, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు

01-07-2025 01:22:52 AM

 సీపీ సాయి చైతన్య 

నిజామాబాద్ జూన్ 30: (విజయ క్రాంతి): నిజామాబాద్ సిపి సాయి చైతన్య పోలీసు ప్రజావాణి కి శ్రీకారం చుట్టారు. నిజాంబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వివిధ సమస్యలపై వచ్చేవారు నేరుగా వారి సమస్యలపై ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 28 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.

ప్రజల ఫిర్యాదుతాలుకు తక్షణమే పరిష్కారం కొరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ సిఐ లకు ఫోన్లో ద్వారా సిపి స్వయంగా మాట్లాడి పరిస్థితిని పరిష్కరించడానికి తగు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు నిర్భయంగా ఎటువంటి సందేహం లేకుండా మధ్య దళారుల ప్రమేయం లేకుండా ఎలాంటి ఫైరవీలకు తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ పోలీస్ సహకరించాలని వారి సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకునేలా ఉండాలన్నారు.

ప్రజలకు పోలీసులు మరింత దగ్గర అయ్యేలా శాంతి భద్రతల పరిరక్షణకు ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని సిపి సాయి చైతన్య ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రజా సమస్యలపై ఫిర్యాదులను ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా అర్జీలను తీసుకుంటామని వెనువెంటనే పరిష్కారానికి తగిన ఆదేశాలు ఇస్తామని సిపి తెలిపారు.

నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్

అభినందించిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబులకు  హెడ్ కానిస్టేబుల్ లుగా నలుగురు ప్రమోషన్ పొందారు. సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నీ కలిసి పువ్వులమొక్క ను బహుకరించారు.

గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబులు ఎం.డి. తయ్యబ్ అలీ, పి.సి:118, మోర్తాడ్ పి.ఎస్ ఈ.ఈశ్వర్, పి.సి:1604,  ఇందల్వాయి పి.ఎస్ పి.రాకేష్, పీ.సీ : 239  నిజామాబాదు రూరల్  పీ.ఎస్ ఎన్.వెంకట్ రామ్ , పి.సి:909, సి సి ఎస్    పి.ఎస్,నిజామాబాద్ కు చెందిన వారికి కానిస్టేబుల్ గా ప్రమోషన్ లభించింది.  ప్రమోషన్ పొందిన సిబ్బంది అయినా హెడ్ కానిస్టేబుల్  లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.