calender_icon.png 1 July, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం

01-07-2025 09:33:39 AM

హైదరాబాద్: నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం(Balkampet Yellamma Kalyanam) జరగనుంది. అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 11.55 గంటలకు ఎల్లమ్మ తల్లి కల్యాణం(Yellamma Kalyanam) వేడుక ప్రారంభం కానుంది. ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. సాధారణ భక్తులకు, వీఐపీలకు పోలీసులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం జరుగుతోంది. ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం మూడ్రోజుల పాటు ఘనంగా జరగనుంది.