calender_icon.png 1 July, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాశమైలారం పేలుడు ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య

01-07-2025 08:15:56 AM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పేలుడు(Pashamylaram Explosion Incident) ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. పేలుడు ధాటికి మరో 36 మందికి గాయాయల్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సుమారు 27 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన కార్మికులు భవనం శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ఆస్పత్రుల్లో మరో 32 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో నలుగురి పేర్లను అధికారులు ప్రకటించారు. మృతులు జగన్మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్, లగ్నజిత్ గా గుర్తించారు.

సిగాచీ ఫార్మా కంపెనీ(Sigachi Pharma Company) భవనం శిథిలాల కింద ఉన్న కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్(State Disaster Response Force), ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు భవనం శిథిలాలను తొలగిస్తున్నాయి. నిన్న ఉదయం సిగాచీ రసాయన పరిశ్రమలోని మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్ నిన్న భారీ పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలింది. రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదమని పోలీసులు తెలిపారు.