calender_icon.png 1 July, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి అమల్లోకి రైల్వే కొత్త నిబంధనలు

01-07-2025 10:19:43 AM

న్యూఢిల్లీ: కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు(Indian Railways New Rules) నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతి ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా, అన్ని ఏసీ తరగతుల ఛార్జీలను 2 పైసలు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ(Ministry of Railways) సోమవారం అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. మంత్రిత్వ శాఖ అధికారులు ముందుగా జూన్ 24న ప్రతిపాదిత ఛార్జీల సవరణను సూచించారు. అయితే, రైళ్లు, తరగతుల వర్గాల ప్రకారం ఛార్జీల పట్టికతో కూడిన అధికారిక సర్క్యులర్ సోమవారం విడుదలైంది.

రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్ రైళ్ల ఛార్జీలు(Railways Rationalises Basic Fare), నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. 500 కి.మీ వరకు సాధారణ సెకండ్-క్లాస్ ఛార్జీలు పెంచబడలేదు. అంతకు మించిన దూరాలకు, టికెట్ ధరలలో కి.మీ.కు అర పైసా పెంచినట్లు  రైల్వే బోర్డు తెలిపింది. జూలై 1 నుండి సాధారణ స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రైలు ప్రయాణానికి కిలోమీటరుకు అర పైస ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ కు ఆధార్ కార్డును రైల్వే శాఖ తప్పనిసరి చేసింది. రిజర్వేషన్ల ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీల్లో మార్పు ఉండదని రైల్వే బోర్డు వెల్లడించింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు అమలు కావాని రైల్వే బోర్డు తెలిపింది