calender_icon.png 1 July, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలానగర్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

01-07-2025 09:09:39 AM

హైదరాబాద్: బాలానగర్ పై వంతెనపై( Balanagar flyover) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పై వంతెనపై నడిచి వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలంలో దర్యాప్తు చేస్తుండగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం పోలీసులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ వెంకటేశంకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. రెండు ప్రమాదాలకు కారణమైన కారు, డీసీఎం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.