ఢిల్లీలో కాంగ్రెస్కు ఇష్టమైన గాడిద గుడ్డే దక్కింది
ఢిల్లీలో బిజెపి గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్ లో నాయకుల సంబరాలు..
గజ్వేల్ (విజయక్రాంతి): ఢిల్లీ ప్రజలు పూర్తి విశ్వాసంతో బీజేపీ పార్టీని గెలిపించారని, లిక్కర్స్ కెమెరా పార్టీకి స్వస్తి పలకడంతో పాటు కాంగ్రెస్కు ఇష్టమైన గాడిద గుడ్డునే ఢిల్లీ ప్రజలు ఇచ్చారని బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ అన్నారు. శనివారం ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్ పట్టణంలో బిజెపి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్, సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి, ఎల్లు రాంరెడ్డి, మండలాధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ... ఢిల్లీ మొదలుకొని తెలంగాణ వరకు లిక్కర్ స్కాంలో పాలుపంచుకున్న ఆప్ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చిపారేశారన్నారు. లిక్కర్ స్కామ్ లో ఒక్కటైన టిఆర్ఎస్ అప్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, అందుకు పూర్తిగా సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వమే ఏర్పడుతుందని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.




