13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం లేదు

28-03-2026 02:25 AM

టాలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘అమరన్’, ‘తండేల్’ వంటి చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న  ఈ భామ ఇప్పుడు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇలా కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్ జర్నీ చేస్తున్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

‘ఒకవేళ నేను అర్ధరాత్రి పూట ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంటే.. కేవలం మా అమ్మ మాత్రమే నాతో అలా కూర్చుంటుంది. ఇంకెవరూ కూర్చోలేరు’ అంటూ భావోద్వేగానికి గురైంది. ‘ఇంత సక్సెస్‌లో ఉండి కూడా సాయిపల్లవి మనసులో ఏదో బాధ ఉందా?.. ఆమె కు అర్ధరాత్రి కూర్చొని ఏడ్చే అలవాటు ఉందా?’ అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో సాయిపల్లవికి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదరైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు పెళ్లిపై పెద్దగా మంచి అభిప్రాయం లేదు.

విచిత్రమేంటంటే, పెళ్లయిన వాళ్లే నన్ను పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన లేదు. నా పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. నేనిప్పుడు సింగిల్‌గా చాలా ప్రశాంతంగా ఉన్నా” అని తెలిపింది. సాయిపల్లవి ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ’ఏక్ దిన్’ చిత్రంతోపాటు, నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ‘రామాయణ’లో నటిస్తోంది. తమిళ స్టార్ ధనుష్‌తోనూ ఒక సినిమా చేస్తోంది.