28 March, 2026 | 3:13 AM

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ

28-03-2026 01:38 AM
  1. ఆదేరోజు జెండా ఎగురవేస్తా.. 

వచ్చే జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేస్తాం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

నిజామాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా జరగలేదని, తెలంగాణ సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాల మేరకు నీళ్లు, నిధులు, నియమ కాలను తెలంగాణ సాధించుకోలేకపోయిందని, వీటి సాధనకే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. 

ఏప్రిల్ 25న రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని ఆమె ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కొత్త చైతన్యం ఏదివచ్చినా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసంతో పార్టీ స్థాపిస్తున్నానన్నారు. ఒక ఆడబిడ్డ పెట్టిన పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుని, ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

నిజామాబాద్ జిల్లా ప్రజల ఆశీస్సులతో కొత్త పార్టీ ప్రకటనను శ్రీరామనవమి పర్వదినాన శ్రీరాముని ఆశీస్సులతో ప్రకటించినట్లు కవిత తెలిపారు. రేవంత్ సర్కార్ రైతులను విస్మరించిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని.. పంటలు చేతికి వచ్చే సమయంలో రైతుబంధు విడుదల చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రైతు సమస్యల పట్ల బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదని ఆమె అన్నారు.

తాను స్థాపించే రాజకీయ పార్టీ కి తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు. యువత రాజకీయాలకు దూరంగా ఉండకుండా రాజకీయాల్లో చేరి తమతో కలిసి రావాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తరపున గ్రామగ్రామాన ఇప్పటికే కార్యకర్తలు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, వచ్చే జెడ్పీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తమ కొత్త పార్టీని బలోపేతం చేస్తానని కవిత తెలిపారు.

తన పార్టీ ఎవరికి బీ టీంగా ఉండబోదని, నంబర్‌వన్ పార్టీ గా తీర్చిదిద్దుతామని.. భవిష్యత్తులో తమ పార్టీ అధికా రంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాన్షీరాం ఆలోచన విధానం మేరకు పార్టీని ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి ఆందోళనతో కేంద్రం దిగి వచ్చిందని, ఆ తర్వాతే కులగణన ప్రకటన చేసిందని కవిత చెప్పారు. తన నాయకత్వంలోనే అసెంబ్లీలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఆధ్వర్యంలో తాను నిర్వహించిన ఆందోళన ఫలితమే అన్నారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కూ డా తన పోరాటాల ఫలితం అని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళల ఐక్యతతో కలిసి రా ష్ట్రంలో భావస్వరూప్యత గల వ్యక్తులతో 27 రో జులపాటు చర్చలు జరిపి ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు మేడ్చల్ జిల్లా మొయినాబాద్‌లో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని కవిత తెలిపారు. టేకు మట్ల బాధితుల కోసం ఆమరణ నిరాహార దీక్షకు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీతో ఉద్యమం చేపట్టిన తర్వాతే ప్రభుత్వం దిగివచ్చి బాధితులకు నివాసగృహాలు కట్టించేందుకు చర్యలు చేపట్టిందన్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉన్నప్పటికీని తెలంగాణలో ఎన్ని కొత్త పరిశ్రమలు స్థాపించారు, ఏ మేరకు నిధులు రాష్ట్రానికి తెచ్చారని  ప్రశ్నించా రు. మూసి ప్రాజెక్టుపై డీపీఆర్ లేదని ముం దుగా ప్రశ్నించింది తానే అని ఆమె గుర్తుచేశారు. డీపీఆర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు లో అప్పుల కోసం వెళ్తుంటే  బీజేపీ అడ్డులేద న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేకమంది ప్రజాప్రతినిధులు తనతో టచ్‌లో ఉన్నారని అన్నారు.