11-11-2025 12:30:18 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు సందర్శించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను పర్యవేక్షించి ఇప్పటికి అక్కడ చేపట్టిన పనులను మున్ముందు చేయాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాల్సిందిగా కోరారు. ఆయనతో రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కూడా ఉన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ డీఈఓ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.