13 June, 2026 | 1:12 AM

ప్రజల సమస్యలు పరిష్కరించాలి

13-06-2026 12:35 AM
  1. లేకుంటే మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తాం
  2. ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరిక

కూకట్ పల్లి, జూన్ 12 (విజయక్రాంతి): ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం బోయిన్ పల్లి కూకట్పల్లి నియోజకవర్గ పరిధి బోయిన్ పల్లి వార్డ్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయిన్ పల్లి లోని కొన్ని ప్రాంతాలను మల్కాజ్ గిరి జోన్ లో కలపడం వల్ల అధికారుల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధి పనులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమీక్ష సమావేశంలో పలు కాలనీలా అసోసియేషన్ సభ్యులు తమ కాలనీలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, డిసి దృష్టికి తీసుకువచ్చారు.  ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డి సి కి ఎమ్మెల్యే సూచించారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ముద్దం నరసింహ యాదవ్, నాయకులు బలవంత రెడ్డి, మక్కల నర్సింగరావు, హరినాథ్, జంగయ్య, యాదగిరి, నరేంద్ర గౌడ్, లలిత గౌడ్, లావణ్య, స్థానిక కాలనీలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.