6 May, 2026 | 11:01 AM

స్వేచ్ఛ మృతికి కారణమైన వ్యక్తులను శిక్షించాలి

01-07-2025 02:52 AM

మీడియా యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి

ఖైరతాబాద్;జూన్ 30 (విజయక్రాంతి) : ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మహిళా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ స్వేచ్చ మరణం, బాధితులను అవమానించడం, నైతిక, చట్టపరమైన అంశాలపై మహిళా జర్నలిస్టుల సమిష్టి సమావే శాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మహిళా జర్నలిస్టులు వనజ, సలీమా, పద్మ, రాజేశ్వరి, సత్యవతి తదితరులు హాజరై మాట్లాడారు.. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మరణాన్ని వ్యూస్ కోసం  ఛానెల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇవి ఏమాత్రం వారి కుటుంబానికి న్యాయం చేయకపోగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఏదైనా ఒక ఘటనను రిపోర్ట్ చేయడం వరకే జర్నలిస్టుల పని, విచారణ కాదన్నారు. మీడి యా యాజమాన్యాలు జర్నలిస్టులకు న్యాయపరమైన అవ గాహన తరగతులు నిర్వహించాలని కోరారు. యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన స్వేచ్ఛ కూతురు వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.