calender_icon.png 1 July, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండమే

01-07-2025 02:54:32 AM

- జూలై రెండవ వారంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా

- బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్

ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో అఖిలభారత యాద వ మహాసభ జాతీయ కార్యదర్శి అయినబోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన యాదవుల సత్యాగ్రహదీక్షలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కుల పాలన, కుటుంబ పాలన, రెడ్డి పాలన చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డిని ఢిల్లీ వేదికగా ఎండగడ తామన్నారు. జూలై రెండవ వారంలో ఢిల్లీ జంతర్మంతర్ వద్ద యాదవుల మహా ధర్నా ఉం టుందని ప్రకటించారు. కామరెడ్డి బిసి డిక్లరేషన్‌లో బీసీలకు, యాదవులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ సుందర్‌రాజు యాద వ్, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, అటవీ శాఖ మాజీ కా ర్పొరేషన్ చైర్మన్ అరిగెల నాగేశ్వరరావు, గొర్ల పెంపకం దార్ల సహకార సంఘం మాజీ చైర్మన్ సోమనబోయిన సుధాకర్ యాదవ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, అఖి ల భారత యాదవ మహాసభ హైదరాబాద్ అధ్యక్షుడు మైకోల్ మహేందర్ యాదవ్, కొక్కు దేవేందర్ యాదవ్ పాల్గొన్నారు.