calender_icon.png 18 August, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

18-08-2025 11:59:13 AM

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఏ ప్రమాదం సంభవించిన వెంటనే పోలీస్ లకు సమాచారం అందించాలని, ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్(SP Kantilal Patil) ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై గాని, ఇతర ప్రదేశాలలో గాని సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలపై తక్షణ స్పందన కలిగే విధంగా పోలీస్ అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. 

వాగులు, చెరువులను అనుకోని ఉండే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువులు కాపరులు వాగులు, వంకల వైపు వెళ్లరాదని, గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు గస్తీ పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712670551 కు సమాచారం అందించగలరని కోరారు. పోలీస్ శాఖ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు.

జిల్లా ప్రజలకు పోలీస్ ల విజ్ఞప్తి...

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి:

1.వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది.

2.ఇనుప వైర్‌లపై బట్టలు ఆరబెట్టరాదు.

3.ఇంటి పైకప్పు ఇనుప రేకులను తాకరాదు.

4.శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మట్టీ గోడల ఇండ్లలో ఉండరాదు.

5.రైతులు బావులు, బోర్ల వద్ద స్టార్టర్ బాక్స్‌లు, ఫ్యూజ్ బాక్స్‌లను తాకరాదు.

6.వరద నీటితో చెరువులు నిండిపోవడం వల్ల చెరువు కట్టలు తెగిపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి.

7.చిన్నపిల్లలు, ఈత రాని వారు చెరువుల్లో ఈతకు లేదా చేపల వేటకు వెళ్ళరాదు.

8.వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం వల్ల రహదారులు దెబ్బతిన్న గుంతలు ప్రమాదకరంగా మారవచ్చు.

9.డ్రైనేజి మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా నడవండి.

10.వర్షాల కారణంగా కల్వర్టులు, చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తే వాహనాలతో దాటకండి.

11.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.

12. వాటర్ ఫాల్స్ సందర్శనలు చేయవద్దు.