calender_icon.png 18 August, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత చూపు బిజెపి వైపు

18-08-2025 11:15:45 AM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు...

బిజెపిలో పలువురు చేరిక.. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధికి యువత ఆకర్షితులై బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు(District Convener Arigela Nageshwar Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని కంచుకోటకు చెందిన యువత మాజీ వార్డు సభ్యుడు చిప్ప చిట్టిబాబు ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. అరిగెల వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ కేవలం బిజెపితోనే సాధ్యమవుతుందన్నారు.

పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాలు భారతదేశ అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు పన్నుతున్నాయని వాటిని  తిప్పికొట్టే సత్తా ప్రధానమంత్రి మోడీకి ఉందని తెలిపారు. స్థానిక సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంస్థకతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో నాగ మణి, సురేష్, మహేష్, సాయి, కిరణ్, నాగేష్ తో పాటు 40 మంది యువత ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ గౌడ్, శ్రీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.