18-08-2025 12:24:41 PM
బెల్లంపల్లి కరాటే మాస్టర్ రవి సిక్స్త్ డన్ కైవసం..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ విజ్జిగిరి రవి సిక్స్త్ డాన్ బెల్ట్ సాధించారు. ఈనెల 17వ తేదీన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జాతీయస్థాయి కరాటే బెల్ట్ టెస్ట్ పోటీల్లో మాస్టర్ విజ్జిగిరి రవి పాల్గొన్నారు. బ్లాక్ బెల్ట్- సిక్స్త్ డాన్ సాధించాడని కెనీ భూ కాయ్ కరాటే ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ విజయం ఒక ప్రకటన తెలిపారు. బ్లాక్ బెల్ట్- సిక్స్త్ డాన్ సాధించిన రవిని తెలంగాణ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు.