18-08-2025 12:31:02 PM
పూడ్పించిన అధికారులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పెద్ద చెరువు కట్టకు గండి పడింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే రెవెన్యూ, పోలీస్ అధికారుల స్పందించి కట్టపై ఏర్పడ్డ గండిని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తహసిల్దార్ ఇమ్మానియేల్(Tahsildar Emmanuel), సిఐ రాజేష్, ఎస్సై వంశీధర్ అప్పటికప్పుడు జేసీబీ తెప్పించి గండిని పూడ్చారు. చెరువు కట్టకు పడ్డ గండిని తాత్కాలికంగా పూడ్చినప్పటికీ, కట్ట పటిష్టతకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.