calender_icon.png 18 August, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉధృతంగా ప్రవహిస్తున్న సర్వపూర్ వాగు

18-08-2025 11:19:09 AM

బాన్సువాడ- గాంధారికి రాకపోకలు బంద్..

రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు..

ఇబ్బంది పడుతున్న ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు.. 

గాంధారి (విజయక్రాంతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అదేవిధంగా ఆదివారం రాత్రి వర్షం బాగా కురవడంతో వరద ఎక్కువై గాంధారి, బాన్సువాడ ప్రధాన రహదారిపై నుండి సర్వాపూర్(Sarvapur) వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గాంధారి, బాన్సువాడ రాకపోకలకు ఆగిపోయయి. ప్రయాణికులు, ప్రజలు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారు. అధికారులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనలను దారి మళ్లిస్తున్నారు..

ఆర్టీసీ బస్సులను మొండి సడక్ నుంచి గౌరారం గ్రామం మీదుగా గాంధారి వైపు బస్సులను మళ్లిస్తున్నారు. అత్యవసరంగా ప్రజలు వెళ్లాలంటే ప్రత్యామ్నాయంగా కామరెడ్డి నుండి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు వెళ్లవలసి ఉంటుంది.. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మండల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బ్రిడ్జ్ రోడ్డుకు లోతుగా కిందికి ఉండడంతో వర్షాలు కురుస్తున్న ప్రతిసారి వరద రావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కావున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టి సారించి బిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు, చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు కోరుతున్నారు.