calender_icon.png 18 August, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ కోర్టులో వాటర్ కూలర్ జడ్జి చేతుల మీదుగా ప్రారంభం

18-08-2025 12:28:51 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి జూనియర్ సివిల్ చర్చి కోర్టులో న్యాయవాదులకు జనగాం తొర్రూర్, సూర్యాపేట హుజూర్నగర్, కోదాడ, హైదరాబాదు నుండి వచ్చే న్యాయవాదులకు త్రాగడానికి మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని 80 లీటర్ల స్టోరేజ్ కలిగిన వాటర్ కూలర్ ను 25000 పెట్టి నేను జ్ఞాన సుందర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖరీదు చేశారు. ఎందుకంటే తల్లి బలంగా ఉందా బలహీనంగా ఉందా అనే విషయం పిల్లలు గమనించలేరు. ఆకలితో ఉన్న పిల్లలకు పాలు ఇవ్వడం ఆహారాన్ని ఇవ్వడం తల్లి బాధ్యత అలాగే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను న్యాయవాదుల సమస్యలను కక్షిదారుల సమస్యలను కోర్టు సిబ్బంది సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నాకుంది అందుకే నాకు ఎన్ని సమస్యలున్నా పైన పేర్కొన్న వారి బాధలను తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

అందుకే ఇప్పటికే బార్ అసోసియేషన్ కొరకు ఇంతకుముందే టేబుల్స్ కుర్చీలను టీవీని బహుకరించారు. న్యాయ శాస్త్ర పుస్తకాలను అందదజేశాను. ఇప్పుడు వాటర్ కూలర్ ను బౌహూకరించి జడ్జ్  ప్రారంభోత్సవం చేయించాను. ఈ సందర్బంగా జడ్జి తాగు నీరు సమస్య చాలా తీవ్రంగా ఉందని ఇది ప్రాదమీక అవసరం అని పేర్కొన్నారు. ఇది నాకెంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఈ సందర్బంగా బార్ అసోసియేషన్ మిత్రులు నాకు సన్మానం చేశారు. జడ్జి మొదటి సారి బార్ అసోసియేషన్ గదిలోకి వచ్చిన సందర్బంగా వారిని శాలువతో సన్మానం చేశాం. భవిష్యత్తులో తుంగతుర్తి కోర్టు బిల్డింగ్ నిర్మాణం చేయడమే కాకుండా సబ్ కోర్టును మంజూరు చేయించడం కొరకు తీవ్రంగా కృషి చేసి సాధిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.