23 June, 2026 | 11:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

10-02-2026 05:57 PM

సుల్తానాబాద్ లో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపల్లి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంబంధిత మున్సిపాలిటీలలో ఏర్పాటు చేశామని, ప్రతిచోట పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సామాగ్రిని ప్రశాంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ప్రతి పోలింగ్ కేంద్రం నందు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ , ఆర్డీవోలు గంగయ్య, సురేష్,మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్  తదితరులు పాల్గొన్నారు ,