calender_icon.png 8 November, 2024 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుషిత నీటితో 50 మందికి అస్వస్థత

14-10-2024 01:13:56 AM

ఇద్దరు మృతిచెందారంటున్న గ్రామస్థులు 

నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావ్‌పేట్‌లో ఘటన

గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, డీఎంహెచ్‌వో

నారాయణఖేడ్, అక్టోబర్ 13: కలుషిత నీరు తాగి 50 మంది అస్వస్థతకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని సంజీవన్‌రావ్‌పేట గ్రామం లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో ని బీసీ కాలనీకి తాగునీటిని సరఫరా చేస్తున్న బావిలో చెత్తాచెదారం, మురుగు చేరడంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు వెల్లడించారు.

అదేవిధంగా కలుషిత నీటితో మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన వృద్ధురాలు బాయికాడి సాయమ్మ(80) మృతిచెందగా, మరునాడు బోడి మహేశ్ (23) అనే యువకుడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. బావి నుంచి నీటిని ఓహెచ్‌ఆర్ ట్యాంక్‌కు సరఫరా చేస్తుంటారు.

బావిలో నీరు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు మి షన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడం వల్లనే తాగునీరు కలుషితమైందని స్థానికులు చెబుతున్నారు. బీసీ వాడకు చెందిన దాదాపుగా 50 మంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారిలో కొం దరిని ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తుండగా, మరికొందరికి గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పా టు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు.

గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే 

గ్రామంలో ఇద్దరు మృతిచెందడం, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి.. స్థానిక ఆర్డీవో అశోక్ చక్రవర్తితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుతో పాటు అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశాల తో ముగ్గురు ప్రత్యేక వైద్యాధికారులు, ఐదుగురు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశ కార్య కర్తలతో స్థానిక హెల్త్ సబ్ సెంటర్‌లో క్యాం పును ఏర్పాటు చేశారు. కాగా, పారిశుద్ధ్య సమస్య, తాగునీరు కలుషితం కావడం పట్ల పంచాయతీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేశారు. నీటి కలుషితంపై అనుమానాలు వ్యక్తమవడంతో సంబంధిత అధి కారులు ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.  

వివరాలు సేకరించిన డీఎంహెచ్‌వో

విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో గాయత్రీదేవి, డీసీఎస్‌వో గ్రామాన్ని సందర్శించి తాగునీరు కలుషితం అవడంపై వివ రాలు సేకరించారు. నీటిని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. గ్రామస్థు లు ఇద్దరు తాగునీరు కలుషితంతో మరణించలేదని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.