calender_icon.png 6 December, 2024 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాడార్ స్టేషన్‌పై పునరాలోచించాలి

14-10-2024 01:12:17 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్

వికారాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచించాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు.

ఆదివారం స్థానికంగా ఓ ఫంక్షన్ హాలులో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో వికారాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రేడియేషన్‌కు లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఈ విషయం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదనే ఉద్దేశంతో పదేళ్లు అనుమతించలేద న్నారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను పక్కన బెట్టి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వికారాబాద్‌కు వచ్చిన సందర్భంగా.. వికారాబాద్ తన కు ఎంతో సెంటిమెంట్ అని చెప్పి ప్రచారా న్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారని, అదే నిజమైతే ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు.

కేవలం కొడంగల్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గానికి రూ.5 వేల కోట్లు కేటాయించి, వికారాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేస్తే, వికారాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం కొడంగల్‌లో శంకుస్థాపన చేశారని అన్నా రు.

అప్పా నుంచి మన్నెగూడ వరకు జాతీ య రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 29 నెలలు అవుతున్నా ఎందుకు పను లు ప్రారంభం కావడం లేదో సీఎం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు కృష్ణ, విజయ్‌కుమార్, రవిశంకర్ పాల్గొన్నారు.