31 August, 2026 | 6:39 AM

కాంగ్రెస్ జెండా.. సేవాదళ్ అజెండా

31-08-2026 02:11 AM

వనపర్తి మండలం, ఆగష్టు 30: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సేవాదళ్ నాయకులు పిలుపునిచ్చారు.ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గోర్ల జానకిరాములు జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పి. తిరుపతయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని, గ్రామస్థాయి వరకు సేవా కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎం. జయమ్మ, డి. శ్రీనివాసులు, ఏ. ఆంజనేయులు, కాకులోర నారాయణ, రఘు తదితరులు పాల్గొన్నారు.