30 March, 2026 | 8:18 PM

మా బతుకులు ఇంతేనా..

30-03-2026 06:42 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): పీడిత ప్రజల కోసం పీపుల్స్ వార్ ఉద్యమంలో పాల్గొని లొంగిపోయిన వారికి పునర్వాసం హామీ ఇచ్చిన మా బతుకులు మారడం లేదని లొంగిపోయిన మావోయిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో వివిధ దళాలు పనిచేస్తూ 15 ఏళ్లుగా లొంగిపోయిన తమకు ఇప్పటివరకు పునరవాసం కల్పించలేదని కనీసం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని ఇండ్ల స్థలాలు ఇచ్చిన పట్టాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విమానాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో జెసిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ మురళి, రాజన్న మల్లేష్ శ్రీనివాస్ రవీందర్ లలిత సరూప భీమన్న గోవిందు పాల్గొన్నారు.