సుల్తానాబాద్ చెరువు కట్టను ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తాం
30-03-2026 06:46 PM
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు ఊర చెరువు కట్టను ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసుటకు గాను ఎమ్మెల్యే నిధుల నుండి[8.50] ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు, అమృత్ 2.0 యాక్షన్ ప్లాన్ లో నుండి మూడు కోట్ల రూపాయలతో డెవలప్ చేయుట కొరకు అమృత్ కాంట్రాక్టర్స్ వచ్చి సోమవారం చెరువు కట్ట వద్ద మెజర్మెంట్ తీసుకోవడం జరిగిందని చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు , మున్సిపల్ కమిషనర్ రమేష్ లు పాల్గొన్నారు.




