20 August, 2026 | 4:57 AM

పనితీరు మెరుగుపర్చుకోవాలి

20-08-2026 12:00 AM

డీఎంహెచ్‌వో ఆనంద్

మేడ్చల్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్ హాజరైన ట్లు తనిఖీలో వెల్ల డయింది. ఈ విషయమై సంబంధిత ఉద్యోగులను వివరణ కోరారు. మందుల నిలువలను, స్టాక్ రిజిస్టర్ తో సరిపోల్చి పరిశీలించారు.

మందుల లభ్యత, ఎ క్స్పైరీ డేటు పరిశీలించారు. అలాగే యాంటీ రేబిస్ వ్యాక్సిన్, ఇలాంటి స్నేక్స్ వీనం మం దుల నిల్వలు, వాటి నిర్వహణ విధానం పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలపై డిఎంహెచ్వో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించి సిబ్బంది పనితీరు మెరు గుపరుచుకోవాలని సూచించారు.