ప్రమాదం జరిగితేనే.. పర్యవేక్షణ చేస్తారా?
నోటి మాటకు సమాచారం ఇవ్వం.. చట్టం ప్రకారం అడగండి
మండలంలో ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణ
తనిఖీలు చేస్తే ఒట్టు.. నిబంధనలకు తూట్లు
ఎప్పుడు సమాచారం అడిగిన రెండు రోజుల్లో ఇస్తా : శంకర్ నాయాక్, ఎంఈవో, బాలానగర్ మండలం
బాలానగర్, ఆగస్టు 19: విద్య అందరికీ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలని సంకల్పంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాలని సంకల్పంతో ప్రభుత్వం ప్రవేట్ పాఠశాల అనుమతికి శ్రీకారం చుట్టింది. ఈ విధానం బాగానే ఉందని ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ వాటి నిర్వహణ మాత్రం సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో మర్చిపోయినట్లు కనిపిస్తుంది.
నియమ నిబంధనలకు లోబడి ప్రైవేట్ పాఠశాలలో నడవవలసి ఉండగా ఆ పాఠశాలకు విద్యార్థులు చేరు సమయం నుంచి వివిధ సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేసిన యాజమాన్యాలు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. అధికారుల సైతం చూసి చూడనట్టు వ్యవహరించడంతో కొందరి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు వారు చెప్పిందే వేదం చేసింది చట్టం అనే విధంగా ఆ ప్రైవేట్ పాఠశాలలు జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం వ్యక్తం చేస్తుర్రు.
వాహన పరిమితికి మించి విద్యార్థుల ప్రయాణం
ఇంటి నుంచి విద్యార్థులను పాఠశాలకు రాకపోకలు కొనసాగించే సమయంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒకే బస్సు ఉంచి వాటిలో పరిమితికి మించి తీవ్ర ఇబ్బందికరంగా విద్యార్థులను వారి పాఠశాలకు చేరుస్తున్నారు. దీంతోపాటు కనీస సౌకర్యాలు ఆయా పాఠశాలలో కనిపించడం లేదు.
తనిఖీలు చేయాల్సిన అధికార యంత్రాంగం మాత్రం ఆ మాటే వారికి వినబడనంత దూరంగా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. అన్ని విషయాలు తల్లిదండ్రులే పర్యవేక్షణ చేస్తూ ఆందోళన బాట పడితే అప్పుడు అధికారులు స్పందిస్తారా? అంటూ కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న మాట.
సమాచారం ఇస్తే తప్పేంటి?
సమాచార హక్కు చట్టం ప్రకారమే సమాచారం అడగాలని చెబుతున్న అధికారులు చట్టప్రకారం అడిగిన కూడా సమాచారం ఇవ్వకుంటే సంబంధిత అధికారులను ఎవరు ప్రశ్నించాలి. మండల విద్యాధికారి పలుమార్లు సమాచారం అడిగినప్పటికీ అడిగిన ప్రతిసారి రెండు, మూడు రోజుల్లో ఇస్తాను అంటున్నారే తప్ప సమాచారం మాత్రం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ విషయంపై ఉన్నత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మండల వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక నజర్ ఉంచి విద్యార్థులకు మెరుగైన అవసరమైన సదుపాయాలు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రెండు మూడు రోజుల్లో సమాచారం ఇస్తా : శంకర్ నాయక్, ఎంఈవో, బాలానగర్
రెండు మూడు రోజుల్లో మీరు అడిగిన సమాచారం ఇస్తా. ప్రైవేట్ పాఠశాలలో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తాం. అడిగిన ప్రతిసారి ఎంఈవో శంకర్ నాయక్ సమాధానం ఇస్తున్నారు. సమాచారం మాత్రం ఇచ్చిందేకు ఆసక్తి చూపడం లేదు.






