16-09-2025 08:15:16 PM
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం సైబర్ క్రైమ్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలకు ఎవరు పాల్పడిన చట్ట ప్రకారం శిక్షించబడతారన్నారు. సైబర్ నేరాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఇటీవల ఏఐ సాంకేతిక విధానం ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారన్నారు. యువత అమాయకంగా ఎవరిని నమ్మడం గాని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు లోను కాకూడదని అన్నారు.