19-01-2026 06:46:08 PM
కల్వకుర్తి: సారా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా హైదరాబాదు నుంచి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా, హైదరాబాద్ కు చెందిన రహీయోద్దీన్ ఆటోలో 20 బస్తాల బెల్లం 50 కిలోల పట్టిక గుర్తించడం జరిగింది. అతని విచారించగా వెల్దండ మండలం రాచూరు తండాకు చెందిన శంకర్ దిగా తెలుపడంతో అతనిపై కేసు నమోదు చేసి బెల్లం పట్టికను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు.