6 September, 2026 | 11:15 AM

జవహర్‌నగర్‌లోని 58, 59 జీవోల ఇండ్ల నిర్మాణాలకు అనుమతి

28-08-2026 | 02:25am

మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం

జవహర్‌నగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలోని, గ్రామకంఠం, 58, 59 జీవోల నిర్మాణానికి అనుమతులు దక్కనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం ఎదురుచూస్తున్న జవహర్ నగర్ వాసుల పేద‘ ఇంటి‘ కష్టాలు తీరబోతున్నాయి. 

కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ జవహర్ నగర్ వార్డు యందు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ కృ ష్ణారెడ్డి గురువారం తన సిబ్బందితో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ గ్రామకంఠం పరిధిలోని ఉన్న గృహాలకు 58, 59 పట్టాలు ఉన్నటువంటి గృహా లకు గృహాలకు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతిని ఇచ్చామని తెలిపారు. అలాగే జవహర్ నగర్ చంద్రపురి కాలనీ పరిధిలోని 58 ,59 పట్టాలు ఉన్నటువంటి ఇండ్ల హక్కుదారులకు కొత్త ఇంటి నెంబర్లు తీసుకొను టకుగాను అనుమతిని ఇచ్చామని తెలిపారు. అనంతరం ఆయన ఎస్‌ఆర్వో, రెవెన్యూ అధికారులతో మాట్లాడి జవహర్ నగర్ పరి స్థితులను సమీక్షించారు.

జవహర్ నగర్ వాసులు పడుతున్న నిర్మాణ కష్టాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి న సంక్షేమ పథకాలను జవహర్ నగర్ లో అమలు చేయడం సంతోషకరమన్నారు.   ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి తద్వారా కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో దోమల నివారణకు పెద్ద ఎత్తున మున్సిపల్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని దీనికి ప్రజల సహకారం తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం, మున్సిపల్ అధికారులు, శ్రీకాంత్ యాదవ్, శాంతి, శెట్టి శ్రీని వాస్ గుప్తా, శంకర్ గౌడ్, నాయకులు సదానంద్, మనోధర్ రెడ్డి, భాస్కర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు