23 June, 2026 | 8:04 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

22వ డివిజన్ లో చెత్త సేకరణ కోసం నూతన ట్రాక్టర్ కేటాయింపు

24-02-2026 08:19 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని 22వ డివిజన్లో  చెత్త సేకరణ కోసం నూతన ట్రాక్టర్ ను కేటాయించారు. మంగళవారం ట్రాక్టర్ ను మేయర్ కోలగాని శ్రీనివాస్  కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... డివిజన్లో చెత్త సేకరణకు అవసరమైన వాహనాల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వాహన కొరత ఉందని స్థానిక కార్పొరేటర్ బండ రమణారెడ్డి తమ దృష్టికి తీసుకురాగా నూతన ట్రాక్టర్ ను డివిజన్ కు కేటాయించడం జరిగిందన్నారు.

డివిజన్లో పారిశుద్ధ్య పనులు,  చెత్త సేకరణ కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. డివిజన్ అవసరాల కోసం అడగగానే నూతన ట్రాక్టర్ కేటాయించిన మేయర్ కోలగని శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ లకు కార్పొరేటర్ రమణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేష్, గుగ్గిల్లపు రమేష్, వంగల పవన్, పెద్దపల్లి జితేందర్, మొండన్న, ఎన్నం ప్రకాష్, వేముల చంద్రశేఖర్, వెంకటేష్,  బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.