19-01-2026 08:49:33 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రిషబ్ శర్మ (26) 18 వ తేది మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై ఉప్పల్ నుండి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో మేడిపల్లి కనకదుర్గ బార్ సమీపంలో అదే మార్గాన వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఓ పక్క నుండి తగిలించడం జరిగింది.
దాంతో కిందపడి తలకు గాయాలయి తీవ్రమైన రక్త శ్రావo కావడంతో స్థానికులు అంబులెన్స్ లో గాంధీకి తరలించారని, అప్పటికే రిషబ్ శర్మ మరణించడం జరిగిందని తెలిపారు. యాక్సిడెంట్ కి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఐ స్పందిస్తూ ప్రతి వాహనాదారుడు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని , లారీ డ్రైవర్లు రోడ్డుపై బండి నడిపేటప్పుడు పక్కన వాహనదాలను గమనించి నడపవలసిందిగా విజ్ఞప్తి చేశారు.