19-01-2026 08:46:21 PM
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్
బెజ్జూర్,(విజయక్రాంతి): కగజ్ నగర్ ఎల్లగౌడ్ తోటలో 30 పడకల నుండి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి) పనులను కేజీబీవీ పాఠశాల కగజ్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాంగణం లో ప్రారంభించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిటల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజక వర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఈ ప్రజా ప్రభుత్వం కగజ్ నగర్ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు.
ఇందిరా క్రాంతిపత మహిళకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసిందన్నారు. సిర్పూర్ నియోజక వర్గ అభివృద్ధి కి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ, జిల్లా అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.