19-01-2026 08:51:46 PM
రేగొండ,(విజయాక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక–2026 క్యాలెండర్‌ను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలెండర్‌ను విడుదల చేసి విజయక్రాంతి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయక్రాంతి దినపత్రిక ప్రజా సమస్యలపై నిర్భయంగా స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తోందని ప్రశంసించారు. నిష్పక్షపాత జర్నలిజంతో ప్రజలకు సత్యమైన వార్తలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.