22 May, 2026 | 11:34 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి

03-02-2025 11:19 PM

డాక్టర్ మౌనిక...

లక్షేట్టిపేట (విజయక్రాంతి): తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి అని డాక్టర్ మౌనిక అన్నారు. సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన చైల్డ్ ఏంపవర్మెంట్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ..... ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నటువంటి ఆడపిల్లలు.. ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. చర్మవ్యాధులు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు‌.

అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ప్రవళిక మాట్లాడుతూ.... టీనేజ్ లో ఆడపిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి.. అవగాహన కలిగి ఉండాలని అన్నారు. టీనేజ్ లో అపరిచితులైన అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, భద్రంగా చదువుకోవాలని తెలియజేశారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, అపరిచితమైన లింకుల వంటివి వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండాలని అపరిచిత టెలిఫోన్ కాల్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరూ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని కానిస్టేబుల్ ప్రవళిక తెలియజేశారు.

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లయితే తగు విధంగా సహకారం అందిస్తామని తెలియజేశారు. అనంతరం విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు డాక్టర్ మౌనిక, పోలీస్ కానిస్టేబుల్ ప్రవళిక సవివరంగా సమాధానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే. రామ కల్యాణి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వర రావు, చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు హెచ్. శ్రీలత, ఆర్. ప్రవీణ లు, ఇతర ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.