16 April, 2026 | 2:33 AM

భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

05-01-2026 01:21 AM

సుల్తానాబాద్ , జనవరి 4 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ మండల సిఐటియు వివిధ కార్మిక సంఘాల ఆఫీస్ నిర్మాణానికై స్థలముతో పాటు రూము  కేటాయించాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు మండల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య , సిఐటియు సుల్తానాబాద్ మండల కో కన్వీనర్ మాతంగి రాజమల్లు,  మహిళా కార్మిక సంఘం సభ్యులు సలోని, లక్ష్మి, రమ, శోభ, పద్మ, ఈశ్వరమ్మ, విజయ, ఐలమ్మ, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, గుమస్తాల సంఘం గౌరవ అధ్యక్షులు హరి కిషన్ , ఉపాధ్యక్షులు వేగోళం శంకర్ గౌడ్ , వేగోళం అనిల్ , ప్రసాద్ , కుమార్, శ్రీధర్, శోభన్, రాజు, రవీందర్, బండారి స్వామి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.