05-01-2026 01:22:50 AM
రూ.4 లక్షలు మంజూరు చేయించిన మంత్రి పొన్నం
చిగురుమామిడి జనవరి 4 (విజయక్రాంతి) : చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన యువకుడు చెరుకు వంశీ కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతుండగా చికిత్స కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ చేయూతనందించారు. రూ. 4 లక్షల ఎల్ వో సీ అందజేసి అండగా నిలిచారు. వంశీకి రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆపరేషన్ కు డబ్బులు ఇబ్బందిగా ఉండడంతో వారి పరిస్థితి ని స్థానిక నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన మంత్రి బాధిత కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ. 4లక్షల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంజూరు పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిటమల్ల రవీందర్ తో పాటు బుర్ర శ్రీనివాస్ గౌడ్, పోతర్ల శివాంజనేయులు, సిరవేణి సంపత్, గుజ్జుల రాజు, పెనుకుల సంపత్, బెజ్జంకి జాక్స్ కుమార్, కక్కేర్ల సంపత్ గౌడ్, ముద్రవేణి కుమార్, పొగాకుల శ్రీకాంత్, కాశవేణి ఓదెలు, చకిలం శ్రీనివాస్ పాల్గొన్నారు.